నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంగ్టి మండల కేంద్రంలో శుక్రవారం కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ మండలాల ప్రజలు పేకాటకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా పేకాట ఆడినా, నిర్వహించినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో పేకాట నిర్వహించేందుకు స్థలం ఇచ్చిన యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేకాట వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అప్పులపాలై కుటుంబాల్లో గొడవలు, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొందరు జూదం, మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రజలు పేకాటకు దూరంగా ఉండి దీపావళి పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని సీఐ సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు.. కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరిక
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి