ఖాతాదారుడి కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తూ సుధా బ్యాంక్ తన బాధ్యతను చాటుకుంది. కోదాడ బ్రాంచ్‌లో 2023లో గృహ రుణం పొందిన బానోత్ హతీరామ్ అక్టోబర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో రుణానికి సంబంధించిన బీమా క్లెయిమ్ కింద మంజూరైన రూ.5,39,000 చెక్కును మృతుడి భార్య బానోత్ సరితకు బ్యాంక్ ఎండీ పెద్దిరెడ్డి గణేష్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక భద్రతకు ఇన్సూరెన్స్ ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ చెన్నూరు రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి భరోసాగా సుధా బ్యాంక్.. రూ.5.39 లక్షల బీమా చెక్కు అందజేత
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి