40 మంది ప్రయాణికులు ఉంటే కాలనీల వద్దకే బస్సులు..
ప్యాకేజీ టూర్ల సౌకర్యం
హయత్‌నగర్-1 డిపో మేనేజర్ లావణ్య.
హైదరాబాద్ నవంబర్ 6 స్థానికం ప్రతినిధి:
కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఆధ్వర్యంలో అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు హయత్‌నగర్-1 డిపో మేనేజర్ లావణ్య తెలిపారు.
కార్తీకమాసంలో భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వీలుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఒకే ప్రాంతానికి చెందిన 40 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే, వారి కాలనీల వద్దకే బస్సులను పంపించే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
అంతేకాకుండా భక్తులు కోరుకున్న పుణ్యక్షేత్రాలకు అనుగుణంగా ప్యాకేజీ విధానంలో టూర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హయత్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
మరిన్ని వివరాలు, బస్సుల బుకింగ్ కోసం 9959226138 నంబర్‌ను సంప్రదించాలని డిపో మేనేజర్ లావణ్య సూచించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి