కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అందిస్తున్న సేవలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డా. బి. సుబ్బారాయుడు అన్నారు. శుక్రవారం పశువైద్యశాలను సందర్శించిన ఆయన, అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న సేవలను పరిశీలించి అభినందించారు.ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే జంతువులకు సైతం లక్షల రూపాయలు ఖర్చయ్యే క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. డా. పెంటయ్య అంకితభావం, రైతుల పట్ల సేవానిరతి యువ పశువైద్యులకు ఆదర్శమని కొనియాడారు. పశు ఔషధ బ్యాంకు, రైతులకు ఉచితంగా పశుగ్రాస విత్తనాలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న పశుగ్రాస క్షేత్రాన్ని అభినందించారు. ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డా. సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కొండా సాయికృష్ణ, కాంపాటి చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు.
పశువైద్య సేవల్లో కోదాడకు ప్రత్యేక గుర్తింపు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి