Sthanikam - Truth Matters
Logo

అల్లాదుర్గం కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవ దినోత్సవ కార్యక్రమం

Updated : 06 Nov 2026 18:46 IST
As Preferred Source 1 min read
అల్లాదుర్గం కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవ దినోత్సవ కార్యక్రమం

అల్లాదుర్గం: స్థానికం ప్రతినిధి

జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అల్లాదుర్గ్ కోర్టు ఆవరణలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ న్యాయమూర్తి ఎం. సుచరిత మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా న్యాయ సేవల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.

నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని సూచించారు. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, ఆర్థిక స్థోమత లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, వాటిని పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. సమాజంలో ఎదురయ్యే వివిధ సమస్యలపై న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. న్యాయ సేవలు ప్రతి ఒక్కరికీ చేరేలా సంబంధిత వ్యవస్థలు కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అంజయ్య లోక్ అదాలత్ బెంచ్ మెంబర్, సంగయ్య లీగలైట్ కౌన్సిల్, కోర్టు సూపర్డెంట్ పద్మావతి, కోర్టు సిబ్బంది, పోలీస్ కానిస్టేబుళ్లు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది ఎం.ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అల్లాదుర్గం కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవ దినోత్సవ కార్యక్రమం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news