పశువైద్యశాఖ అందిస్తున్న సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల మండలం బరకత్‌గూడెం సర్పంచ్ చల్లా గురవయ్య సూచించారు. శుక్రవారం గ్రామంలో శిథిలావస్థకు చేరిన పశువైద్యశాలకు గోడ నిర్మించి, అవసరమైన సౌకర్యాలు కల్పించిన అనంతరం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పశువులకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు సకాలంలో మందులు అందించడం అవసరమని, వ్యాధుల నివారణకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేనేపల్లి శైలజ రమేష్ బాబు, వార్డు సభ్యులు, పశువైద్య అధికారులు, సిబ్బంది, గోపాలమిత్రులు, పాడి రైతులు పాల్గొన్నారు..
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి