Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

2028లో తెలంగాణలో బీసీ ప్రభుత్వమే!

Updated : 07 Nov 2026 03:29 IST
As Preferred Source 1 min read
2028లో తెలంగాణలో బీసీ ప్రభుత్వమే!

మునుగోడులో తొలి బీసీ ఎమ్మెల్యే ఖాయం: తీన్మార్‌ మల్లన్న

రెడ్లు, వెలమల భూములను పేదలకు పంచుతాం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో ‘కత్తెర’ గుర్తుపై పాలకూరి అశోక్

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మునుగోడులో తొలి బీసీ ఎమ్మెల్యే గెలుపొందడం ఖాయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 44వ రోజు పాదయాత్ర శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చేరుకుంది. సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న మాట్లాడారు.రెడ్డి, వెలమల పాలనతో బీసీలకు ఎలాంటి లాభం జరగలేదని, రైతు పథకాల నిధులన్నీ ధనవంతులకే దక్కాయని మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏటా రూ. 20,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, మూడేళ్లలో రూ. 60,000 కోట్లకు గాను కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. మిగిలిన రూ. 58,000 కోట్ల బీసీ సంక్షేమ నిధులను దోచుకున్నారని మండిపడ్డారు.మునుగోడు నియోజకవర్గంలో 1.37 లక్షల బీసీ ఓట్లు ఉన్నప్పటికీ, కేవలం 18 వేల ఓట్లు ఉన్న రెడ్లకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ వారిని పక్కనపెట్టి పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు.1949లో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బీసీల భూములను దొరల పేరిట ఎక్కించారని తెలిపారు. నిజాం 'ఫస్లీ 1358' చట్టం ఆధారంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాగానే రెడ్లు, వెలమల వద్ద ఉన్న 1 కోటి ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని భూమి లేని పేద బీసీలకు పంచుతామని ప్రకటించారు.వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ‘కత్తెర’ గుర్తుపై పాలకూరి అశోక్ ను నిలబెట్టినట్లు మల్లన్న వెల్లడించారు. "ఓట్ హమారా.. రాజ్ తుమారా.. నై చలేగా!" అన్న నినాదంతో 2028లో బీసీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల హనుమాన్లు,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్, కొమ్మల ప్రవీణ్ రాజ్,పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్చార్జ్ పూజిత,రాష్ట్ర మహిళా నాయకురాలు సునీత,పార్టీ స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్,మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ సతీష్ బాబు, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు యాదగిరి, మహిళా అధ్యక్షురాలు లలిత,మహిళా నాయకురాలు సుశీల,పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

2028లో తెలంగాణలో బీసీ ప్రభుత్వమే!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news