చిట్యాల: మున్సిపాలిటీలోని ఆరో వార్డు వెంకటాపురంలో నల్లా లీకేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఫిర్యాదు చేయగా, సమస్యను సరిచేయాల్సింది పోయి వీధిలోని సాగర్ నల్లా కనెక్షన్‌నే శాశ్వతంగా తొలగించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు అందిస్తున్న నల్లాను మూసివేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గురులింగంను వివరణ కోరగా.. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉన్నందున వీధిలో ఉన్న నల్లా కనెక్షన్‌ను తొలగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.
అయితే లీకేజీ సమస్యను పరిష్కరించాల్సింది పోయి నల్లా కనెక్షన్‌ను తొలగించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి