కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ శివారులో శనివారం కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి