Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

నారాయణ ప్రీమియర్ లీగ్‌లో హయత్ నగర్ బ్రాంచ్ విజయం వనస్థలిపురం జోన్ ఛాంపియన్‌షిప్ కైవసం.. విద్యార్థులకు ట్రోఫీ అందజేత

Updated : 07 Nov 2026 19:09 IST
As Preferred Source 1 min read
నారాయణ ప్రీమియర్ లీగ్‌లో హయత్ నగర్ బ్రాంచ్ విజయం వనస్థలిపురం జోన్ ఛాంపియన్‌షిప్ కైవసం.. విద్యార్థులకు ట్రోఫీ అందజేత

హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో హయత్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి వనస్థలిపురం జోన్ ఛాంపియన్‌గా నిలిచారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీపడి అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని సాధించారు.

ఈ పోటీల్లో కబడ్డీ, క్రికెట్, త్రోబాల్, డాడ్జ్‌బాల్, రన్నింగ్, చెస్ తదితర క్రీడాంశాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు సమన్వయం, పట్టుదలతో పోటీల్లో రాణించి హయత్ నగర్ బ్రాంచ్‌కు గుర్తింపు తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమాన్ని జీఎం గోపాల్ రెడ్డి, వనస్థలిపురం ఏజీఎం రవీంద్రబాబు నిర్వహించారు. జోన్ ఛాంపియన్‌గా నిలిచిన హయత్ నగర్ బ్రాంచ్‌కు ఏజీఎం రవీంద్రబాబు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లావణ్య రెడ్డి, మానస, హైస్కూల్ ఆర్‌ఎండీ శివరంజని, ఎన్‌పీఎల్ ఇన్‌చార్జి రోహిణి, ఈ-చాన్స్ ఆర్‌అండ్‌డీ మహేశ్వరి, ఈ-కిడ్స్ ఆర్‌అండ్‌డీ మీనా, స్పోర్ట్స్ ఆర్‌పీ సురేష్, సాఫ్ట్ స్కిల్స్ జాజి రెడ్డి, హైస్కూల్ కోఆర్డినేటర్ సృజన్, ఈ-చాన్స్ కోఆర్డినేటర్ దివ్య, ఈ-కిడ్స్ కోఆర్డినేటర్ ప్రియాంక, ఏడీ మంజుల, ఈ-చాన్స్ వీపీ కవిత, ఈ-కిడ్స్ వీపీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి