Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

తక్షణమే వరి కొనుగోళ్లు ప్రారంభించాలి: భాజపా మండల ప్రధానకార్యదర్శి పబ్బతి శేఖర్ గౌడ్

Updated : 07 Nov 2026 19:25 IST
As Preferred Source 1 min read
తక్షణమే వరి కొనుగోళ్లు ప్రారంభించాలి: భాజపా మండల ప్రధానకార్యదర్శి పబ్బతి శేఖర్ గౌడ్

మార్కెట్లో పేరుకుపోతున్న వడ్ల కుప్పలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

నేలపట్ల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని భాజపా మండల ప్రధాన కార్యదర్శి పబ్బతి శేఖర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్‌లో వడ్ల కుప్పలు పేరుకుపోయి, అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.​ప్రస్తుతం తుపాను హెచ్చరికలు, అకాల వర్షాల భయంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు అధికారికంగా ప్రారంభించి ఇప్పటి వరకు కాంటాలు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నేలపట్ల మార్కెట్‌లో కాంటాలు వేసి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

Sthanikam

తక్షణమే వరి కొనుగోళ్లు ప్రారంభించాలి: భాజపా మండల ప్రధానకార్యదర్శి పబ్బతి శేఖర్ గౌడ్

Article Image

మార్కెట్లో పేరుకుపోతున్న వడ్ల కుప్పలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

నేలపట్ల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని భాజపా మండల ప్రధాన కార్యదర్శి పబ్బతి శేఖర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్‌లో వడ్ల కుప్పలు పేరుకుపోయి, అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.​ప్రస్తుతం తుపాను హెచ్చరికలు, అకాల వర్షాల భయంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు అధికారికంగా ప్రారంభించి ఇప్పటి వరకు కాంటాలు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నేలపట్ల మార్కెట్‌లో కాంటాలు వేసి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news