Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు: గ్రామసభలో ఓప్పుకున్న సెక్రటరీ! నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 06:06 PM

వికలాంగుల బస్సు పాస్‌లపై ఆంక్షలెందుకు?

వికలాంగుల బస్సు పాస్‌లపై ఆంక్షలెందుకు?

వికలాంగుల బస్సు పాస్‌లపై ఆంక్షలెందుకు?
02-10-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి.. 8న బస్సు భవన్‌ ఎదుట ధర్నా

రామన్నపేట: వికలాంగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల పాసులకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌ 8న హైదరాబాద్‌లోని బస్సు భవన్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఎన్‌పీఆర్‌డీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వనం ఉపేందర్‌ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 34 నెలలు పూర్తవుతున్నా హామీ అమలుకు నోచుకోలేదని తెలిపారు.

పాసు ఉన్నా ప్రయాణానికి పరిమితులా?

జిల్లా స్థాయిలో డీలక్స్‌ బస్సుల్లో వికలాంగుల రాయితీ పాసులను అనుమతిస్తున్నారని, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రం ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ బస్సుల్లో పాసులను అనుమతించడం లేదని ఉపేందర్‌ పేర్కొన్నారు. ఆర్డినరీ బస్సులు తక్కువ సంఖ్యలో తిరుగుతున్న నేపథ్యంలో వికలాంగులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రేటర్‌ పరిధిలో నడిచే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌.. అన్ని రకాల బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

హామీ అమలు చేయాల్సిందే

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ వికలాంగులు 34 నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు గ్రేటర్‌ పరిధిలో అన్ని రకాల బస్సుల్లో పాసులను అనుమతించాలని కోరారు.

అక్టోబర్‌ 8న హైదరాబాద్‌లోని బస్సు భవన్‌ ఎదుట నిర్వహించే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ హక్కుల కోసం గళమెత్తాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నిదానపల్లి గ్రామ అధ్యక్షుడు బొడ్డుపల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శి భాషబోయిన యాదయ్య, ఉపాధ్యక్షుడు భాషబోయిన ప్రభుదాస్, చల్ల నాగార్జున, వంగాల రాజు, వీరమల్ల శీను, వర్గాల స్వామి, నారప్పక శ్యామసుందర్, ఆగుల లచ్చమ్మ, వి.జానమ్మ, ఏ.లక్ష్మయ్య, వి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల బస్సు పాస్‌లపై ఆంక్షలెందుకు?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News