Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

వైద్య విద్యకు దాతల చేయూత.. విద్యార్థినికి రూ.1.35 లక్షల సాయం

Updated : 08 Nov 2026 04:51 IST
As Preferred Source 1 min read
వైద్య విద్యకు దాతల చేయూత.. విద్యార్థినికి రూ.1.35 లక్షల సాయం

మునగాల మండలానికి చెందిన పేద విద్యార్థిని లంజపల్లి సౌజన్య ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుకు కళాశాల ఫీజు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న దాస్ సేవా సమితి చైర్‌పర్సన్ గాయత్రి గుప్తా స్పందించి రూ.1.35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మునగాలకు చెందిన చిల్లంచర్ల ప్రభాకర్ ద్వారా మాజీ సర్పంచ్ ఎస్. వెంకట రామిరెడ్డి, రిటైర్డ్ హెచ్‌ఎం చెన్నూరు నర్సింగరావులకు ఈ విషయం తెలియగా, వారు దాస్ సేవా సమితి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గాయత్రి గుప్తా సహృదయంతో స్పందించి విద్యార్థిని కళాశాల ఫీజును నేరుగా చెల్లించారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ తన చదువుకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం తనలాంటి పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు ఇలాంటి సహాయం ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Sthanikam

వైద్య విద్యకు దాతల చేయూత.. విద్యార్థినికి రూ.1.35 లక్షల సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి