మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళిని గ్రామ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. పండుగ సందర్భంగా ప్రతి ఇంటా సంతోషం నిండాలని, గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, పరస్పర సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ ఆకాంక్షించారు.
రేపాల గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి