పోచంపల్లి పట్టణంలో నిర్వహించిన జిల్లా ట్రస్మా సమావేశంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పంతంగి భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శిగా ఎల్లె తిరుమలరెడ్డి, కోశాధికారిగా కటికరెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నామని భాస్కర్, పారుపల్లి విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులుగా దిండు వినీల, బుగ్గ లావణ్య, లింగమూర్తి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాలకూర్ల వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగనం బోయిన సత్యనారాయణ, జిల్లా కోశాధికారి వంగూరు పాండు, గౌరవ అధ్యక్షుడు గాది సోమిరెడ్డి, ముఖ్య సలహాదారు డాక్టర్ మెరుగు మధు, జిల్లా నాయకులు మిర్యాల దుర్గాప్రసాద్, తుంగతుర్తి రంగారావు, శవన్ వర్మ, సజ్జన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి