కోదాడలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎన్సీసీ క్యాడెట్ల ఎంపిక ప్రక్రియ శనివారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హదసారాణి ఆధ్వర్యంలో నల్గొండ 31(టి) బెటాలియన్ బృందం విద్యార్థులకు 1.2 కిలోమీటర్ల పరుగు, ఇతర శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థుల శారీరక సామర్థ్యం, చురుకుదనం, పట్టుదల, క్రమశిక్షణను పరిశీలించి ఎంపిక చేపట్టారు. మొత్తం 104 మంది క్యాడెట్లకు అవకాశం ఉండగా, తొలివిడతలో 35 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులను ఎంపిక చేశారు. ఎన్సీసీ శిక్షణ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పాటు దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. ఎంపికైన విద్యార్థులు శిక్షణలో చురుకుగా పాల్గొని మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
కె.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ ఎంపికల సందడి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి