కోదాడలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో సత్తా చాటారు. యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్‌కు చెందిన వినీత, ప్రణతి, లావణ్య, లక్ష్మీ ప్రసన్న, సింధు నృత్య విభాగంలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే కవిత్వ రచన పోటీలో ఆర్. యోగేశ్వరి తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి విద్యార్థులను అభినందించారు. తెలంగాణ సంస్కృతి, పల్లె జీవన విధానాన్ని నృత్య రూపంలో అద్భుతంగా ప్రదర్శించడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.
కె.ఆర్.ఆర్. కళాశాల విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలకు ఎంపిక
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి