కరువు మండలాలుగా ప్రకటించడమే కాకుండా, ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు సుంకరి అజయ్ కుమార్, మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మునగాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కరువు ప్రభావంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వరి సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలు సాగు చేసిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. కరువు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి 200 రోజుల పని, రోజుకు రూ.500 కూలి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ కోళ్ల ఉపేందర్, ఉడుం కృష్ణ, ఎల్పీ రామయ్య, గడ్డం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి