Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మోడల్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా బూట్లు, డైరీల పంపిణీ

Updated : 08 Nov 2026 04:51 IST
As Preferred Source 1 min read
మోడల్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా బూట్లు, డైరీల పంపిణీ

పీఎం శ్రీ తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్, మునగాలలో శనివారం విద్యార్థులకు ఉచితంగా బూట్లు, డైరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునగాల సర్పంచ్ ప్రమేలా శ్రీనివాస్ నల్లపాటి విద్యార్థులకు బూట్లు, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సమయపాలన, పరిశుభ్రత వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. డైరీలలో రోజువారీ విద్యా కార్యకలాపాలను నమోదు చేసుకోవడం ద్వారా ప్రణాళికాబద్ధంగా చదువుకునే అలవాటు ఏర్పడుతుందన్నారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ పేర్కొంటూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మోడల్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా బూట్లు, డైరీల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి