పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల మునగాల విద్యార్థులు శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.హెల్త్ కేర్ వొకేషనల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా నిర్వహించిన ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ విజిట్‌లో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అత్యవసర విభాగం పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.రోగులకు అందించే వైద్య సేవలు, ఆసుపత్రి నిర్వహణ తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వొకేషనల్ ట్రైనింగ్ ఉపాధ్యాయురాలు విజయదుర్గ మాట్లాడుతూ.. విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి శిక్షణ ఎంతో అవసరమన్నారు.వైద్య వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అదొక గొప్ప సేవ అని విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. ఇలాంటి పర్యటనలు విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీరబాబు, ఇన్‌చార్జి రామకృష్ణ, ఉపాధ్యాయులు ఎస్.కె. జాకీర్, ఎస్.కె. షరీఫ్, రేణుక, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై విద్యార్థులకు అవగాహన
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి