Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఖమ్మం ఐటీ హబ్, సైన్స్ మ్యూజియాన్ని సందర్శించిన కోదాడ విద్యార్థులు

Updated : 08 Nov 2026 04:51 IST
As Preferred Source 1 min read
ఖమ్మం ఐటీ హబ్, సైన్స్ మ్యూజియాన్ని సందర్శించిన కోదాడ విద్యార్థులు

కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ఖమ్మంలోని ఐటీ హబ్, సైన్స్ మ్యూజియం, బ్యూటీ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో జరుగుతున్న కార్యకలాపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్షేత్రస్థాయి అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎండీ సలీం షరీఫ్ మాట్లాడుతూ క్షేత్ర పర్యటనలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నూతన విషయాలను నేర్చుకునే ఆసక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రత్యక్ష అనుభవాల ద్వారా వివిధ వృత్తులు, సాంకేతిక రంగాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. జిల్లా విద్యాధికారి చావా శ్రీనివాసరావు విద్యార్థులను కలుసుకుని పర్యటన ఉద్దేశాన్ని వివరించి ప్రోత్సహించారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఖమ్మం ఐటీ హబ్, సైన్స్ మ్యూజియాన్ని సందర్శించిన కోదాడ విద్యార్థులు

Article Image

కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ఖమ్మంలోని ఐటీ హబ్, సైన్స్ మ్యూజియం, బ్యూటీ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో జరుగుతున్న కార్యకలాపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు క్షేత్రస్థాయి అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎండీ సలీం షరీఫ్ మాట్లాడుతూ క్షేత్ర పర్యటనలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నూతన విషయాలను నేర్చుకునే ఆసక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రత్యక్ష అనుభవాల ద్వారా వివిధ వృత్తులు, సాంకేతిక రంగాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. జిల్లా విద్యాధికారి చావా శ్రీనివాసరావు విద్యార్థులను కలుసుకుని పర్యటన ఉద్దేశాన్ని వివరించి ప్రోత్సహించారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి