అంభాత్రయ ఆలయ సన్నిధిలో ప్రారంభోత్సవం
V1 మ్యూజిక్ ఛానల్ ద్వారా ప్రజలను చైతన్యపరిచే మంచి పాటలను రూపొందించి అందరి మన్ననలను పొందాలని అంభాత్రయ క్షేత్ర పాలకులు డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ పరాశ్రీ స్వామి పిలుపునిచ్చారు. అంభాత్రయ ఆలయ సన్నిధిలో గురువారం రోజున V1 మ్యూజిక్ ఛానల్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముందు స్వామివారు ముగురమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఛానల్ నిర్వాహకులను ఆశీర్వదించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో V1 మ్యూజిక్ అధినేత వరగంటి రాజేందర్ గౌడ్, వరగంటి మహేందర్ గౌడ్, పల్లె మల్లేశం గౌడ్, మారుపాక శ్రీశైలం గౌడ్, పబ్బు సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి