Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 01:22 PM

ఉత్సాహంగా 'మల్కంబ్' ఎంపిక పోటీలు

ఉత్సాహంగా 'మల్కంబ్' ఎంపిక పోటీలు

ఉత్సాహంగా 'మల్కంబ్' ఎంపిక పోటీలు
30-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ట్రినిటీ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహణ

రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ట్రినిటీ హైస్కూల్ ప్రాంగణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) అండర్-14, అండర్-17 బాల, బాలికల మల్కంబ్ ఎంపిక పోటీలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ ఎంపికైన ప్రతిభావంతులు రాబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ మల్కంబ్ పోటీలలో ఉమ్మడి నల్గొండ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.​ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) గురువారావు మాట్లాడుతూ... మల్కంబ్ క్రీడ విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, సమతుల్యత, ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందిస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, భారతీయ సాంప్రదాయ క్రీడ అయిన మల్కంబ్‌ను ప్రోత్సహించాలని కోరారు.

​రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు:

​అండర్-14 బాలికలు: ఎన్. వైష్ణవి, ఎం. మేఘన, పి. హారిణి, కె. కావ్య శ్రీ, చ. హర్షిత, ఎన్. నిత్య శ్రీ.

​అండర్-14 బాలురు: బి. చరణ్, వేదమానస్, డి. యశ్వంత్, చ. విఘ్నేష్, చ. సంజయ్ కుమార్, బి. ఆదిత్య.

​అండర్-17 బాలురు: చ. దీక్షిత్, యు. రాధే శ్యామ్, పి. శశాంక్, జి. చిద్విలాస్, కె. కరణ్, ఎ. సాయికార్తిక్.

​అండర్-17 బాలికలు: ఎ. ఆకాంక్ష, ఎన్. మోక్షిత, కె. కృతిక, ఎ. వైష్ణవి, ఎస్. సహితి, జి. ప్రణవి.​ఈ కార్యక్రమంలో పీఈటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎస్‌జీఎఫ్ మండల కార్యదర్శి లింగయ్య, కోయలగూడెం జెడ్‌పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు మట్టయ్య, ట్రినిటీ హైస్కూల్ చైర్మన్ కె.వి.బి. కృష్ణారావు, ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల, తెలంగాణ మల్కంబ్ అసోసియేషన్ కార్యదర్శి ఎం. గోపాల్, వివిధ పాఠశాలల పీఈటీలు పాల్గొని విజేతలను అభినందించారు.

Sthanikam

ఉత్సాహంగా 'మల్కంబ్' ఎంపిక పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News