VB-G RAMG పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని DRDO సన్నాసయ్య అధికారులకు సూచించారు. గురువారం మునగాల మండలం బరఖతూడెం గ్రామపంచాయతీ పరిధిలోని RCP వర్క్స్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల పురోగతి, కూలీల హాజరు, పనుల నిర్వహణ తీరుపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పనులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కూలీలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పనుల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
ఉపాధి హామీ పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి