మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం మునగాల మండలంలోని నరసింహపురం, గణపవరం, మునగాల, నారాయణగూడెం, విజయరాఘవపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన శ్రీశక్తి భవనాలను ఆమె ప్రారంభించారు. నారాయణగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని సైతం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్ కేంద్రాలు, టెంట్ హౌస్ యూనిట్లు,బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబాలు,సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు.మహిళా సంఘాలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు, అధికారులు,మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి