Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన డీఆర్డీఓ

Updated : 12 Nov 2026 21:37 IST
As Preferred Source 1 min read
గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన డీఆర్డీఓ

గ్రామపంచాయతీలకు సంబంధించిన రికార్డులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని డీఆర్డీఓ సన్నాసయ్య సూచించారు.గురువారం మునగాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో, ఈసీ, టీఏ, ఎఫ్ఏ అధికారులతో కలిసి గ్రామపంచాయతీ రిజిస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా వివిధ రిజిస్టర్లలో నమోదైన వివరాలు, వాటి నిర్వహణ తీరును క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల్లో చేపడుతున్న పనులు, వాటికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ విధుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

Sthanikam

గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన డీఆర్డీఓ

Article Image

గ్రామపంచాయతీలకు సంబంధించిన రికార్డులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని డీఆర్డీఓ సన్నాసయ్య సూచించారు.గురువారం మునగాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో, ఈసీ, టీఏ, ఎఫ్ఏ అధికారులతో కలిసి గ్రామపంచాయతీ రిజిస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా వివిధ రిజిస్టర్లలో నమోదైన వివరాలు, వాటి నిర్వహణ తీరును క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల్లో చేపడుతున్న పనులు, వాటికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ విధుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి