Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసుల అవగాహన

Updated : 12 Nov 2026 20:27 IST
As Preferred Source 1 min read
సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసుల అవగాహన

కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం కోదాడ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రత, పోలీస్ అక్క సేవలపై ప్రజలకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మహిళలు, బాలికలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.

Sthanikam

సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసుల అవగాహన

Article Image

కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం కోదాడ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రత, పోలీస్ అక్క సేవలపై ప్రజలకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మహిళలు, బాలికలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి