Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఈబీఆర్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం

Updated : 12 Nov 2026 20:31 IST
As Preferred Source 1 min read
ఈబీఆర్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న భువనగిరి పట్టణంలోని ఈబీఆర్ నర్సింగ్ హోమ్‌లో ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈ. బలరాం తెలిపారు.

మైక్రో ల్యాబ్స్ డీటీఎఫ్ 1 డివిజన్ సహకారంతో నిర్వహించే ఈ శిబిరం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. శిబిరంలో కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఈ. బలరాం (ఎం.బి.బి.ఎస్., డి.ఎన్.బి.), గైనకాలజిస్ట్ డాక్టర్ పి. అనురాధ (ఎం.బి.బి.ఎస్., డి.జి.ఓ.) వైద్య సేవలు అందించనున్నారు.

మధుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ బలరాం తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

ఈబీఆర్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి