Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

Updated : 12 Nov 2026 20:26 IST
As Preferred Source 1 min read
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట జిల్లా కోదాడ పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థులు 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. 'డొమెస్టిక్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్' అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టు ద్వారా ఈ విజయాన్ని సాధించారు. వ్యర్థ జలాల నిర్వహణ, వాటి పునర్వినియోగంపై రూపొందించిన ఈ ప్రాజెక్టు పోటీల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. విద్యార్థులు సాధించిన విజయంపై జిల్లా విద్యాశాఖ అధికారి చావా శ్రీనివాసరావు, ఎంఈఓ సలీం షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ విజయం పాఠశాలకు, ఉపాధ్యాయులకు గర్వకారణమని పేర్కొన్నారు.

Sthanikam

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

Article Image

సూర్యాపేట జిల్లా కోదాడ పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థులు 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. 'డొమెస్టిక్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్' అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టు ద్వారా ఈ విజయాన్ని సాధించారు. వ్యర్థ జలాల నిర్వహణ, వాటి పునర్వినియోగంపై రూపొందించిన ఈ ప్రాజెక్టు పోటీల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. విద్యార్థులు సాధించిన విజయంపై జిల్లా విద్యాశాఖ అధికారి చావా శ్రీనివాసరావు, ఎంఈఓ సలీం షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ విజయం పాఠశాలకు, ఉపాధ్యాయులకు గర్వకారణమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి