మునగాల మండలంలో ఉపాధి హామీ పనుల పారదర్శక అమలు, కూలీలకు మెరుగైన సేవలు అందించేందుకు 185 మంది మేటీలను గుర్తించినట్లు ఎంపీడీవో రమేశ్ దీన్ దయాల్ తెలిపారు. మండలంలో మొత్తం 8,772 మంది కూలీలు ఉండగా, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేటీని చొప్పున ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన మేటీలకు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసి, ఈ నెల 12, 13 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల హాజరు నమోదు, పనుల పర్యవేక్షణ, ప్రభుత్వ నిబంధనల అమలుపై మేటీలకు అవగాహన కల్పించారు. కూలీలకు పనులు కల్పించడంతో పాటు పనుల్లో పారదర్శకత పాటించేలా మేటీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శైలజ, ఈసీ కళ్యాణ్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల పారదర్శకతకు 185 మంది మేటీల ఎంపిక
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి