మండల కేంద్రంలోని పురాతన నాగులమ్మ దేవస్థానంలో శుక్రవారం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని నాగదేవతకు పాలు, పండ్లు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మునగాల గ్రామ సర్పంచ్ నల్లపాటి ప్రమీల పాల్గొని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు.పలువురు భక్తులు ఆలయాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నాగులమ్మ ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి