మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన వైద్యాధికారిగా డాక్టర్ రాజ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది వివరాలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: డాక్టర్ రాజ్ కుమార్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి