నల్లగొండలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, సీపీఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. శుక్రవారం మునగాలలోని సుందరయ్య భవనంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రైతు ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు రైతులకు నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, చందా చంద్రయ్య, దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు మహాసభలను విజయవంతం చేయాలి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి