ఆధునిక సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని కేఎల్ విశ్వవిద్యాలయం సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ పి. మాలతి అన్నారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు ఏఐ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఐ ద్వారా విద్యార్థినుల్లో అభ్యాస సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. కోడింగ్, గణితం, డేటా విశ్లేషణ, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో ఏఐ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. పరిశోధనలు, ప్రాజెక్టుల రూపకల్పనలో కూడా కృత్రిమ మేధ కీలకంగా మారిందన్నారు. విద్యార్థినులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డాక్టర్ గాంధీ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
విద్యార్థినులు ఏఐ సాంకేతికతపై పట్టు సాధించాలి: డాక్టర్ మాలతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి