Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఢీకొని డ్రైవర్ మృతి

Updated : 14 Nov 2026 07:24 IST
As Preferred Source 1 min read
ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఢీకొని డ్రైవర్ మృతి

మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 65 ఫ్లైఓవర్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు వాహనం క్యాబిన్ ధ్వంసం కావడంతో మృతదేహాన్ని బయటకు తీయడం కష్టతరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఢీకొని డ్రైవర్ మృతి

Article Image

మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 65 ఫ్లైఓవర్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు వాహనం క్యాబిన్ ధ్వంసం కావడంతో మృతదేహాన్ని బయటకు తీయడం కష్టతరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి