నారాయణఖేడ్ కేంద్రంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే తీసుకుని 51 శాతం వేతన పెంపు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. జీవో 25ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, పెండింగ్ బిల్లులను ఏక మొత్తంగా ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, సమగ్ర శిక్షా ఉద్యోగులకు కాలపరిమితి వేతన విధానం వర్తింపజేయడంతో పాటు సమ్మె కాలపు వేతనాలను చెల్లించాలని, మోడల్ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఖాతా కింద వేతనాలు అందించాలని కోరారు. అన్ని గురుకుల పాఠశాలలకు ఒకే విధమైన పని సమయాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని భాస్కర్ దేశ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్, రాష్ట్ర సేవా విభాగం ప్రముఖ్ చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్, జిల్లా అధ్యక్షులు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షులు వినయ్, మల్లికార్జున్, లక్ష్మణ్, కిషన్, నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు జగదీశ్వర్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి:తపస్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి