Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి

ఉద్యోగం వదిలి.. ఊరికే పెద్దగా! యూట్యూబర్ ప్రసాద్.. ఇప్పుడు మడక సర్పంచ్!

Updated : 18 Dec 2025 09:53 IST
As Preferred Source 1 min read
ఉద్యోగం వదిలి.. ఊరికే పెద్దగా! యూట్యూబర్ ప్రసాద్.. ఇప్పుడు మడక సర్పంచ్!
స్థానికం, ఓదెల:

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజాసేవకే నా జీవితం అంకితం అంటూ ఎన్నికల బరిలోకి దిగాడు. మాటలతో కాదు, చేతలతో గ్రామ రూపురేఖలు మారుస్తానని ప్రతినబూనాడు. అనుకున్నట్టే, తొలి ప్రయత్నంలోనే గ్రామస్థుల హృదయాలను గెలుచుకొని, సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ యువ కెరటమే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆవాల ప్రసాద్.

కళాకారుడు To నాయకుడు

డిఎడ్ పూర్తి చేసి, ఉపాధి హామీ పథకంలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్, కేవలం ప్రభుత్వ ఉద్యోగిగా మిగిలిపోలేదు. తనలోని కళాకారుడిని ప్రపంచానికి పరిచయం చేస్తూ 'ప్రసాద్ మ్యూజిక్' పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. అతని పాటలు, అతని మాటలు గ్రామ ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అదే ఆదరణ, ఇప్పుడు ఓట్ల రూపంలో ఆయనను విజయతీరాలకు చేర్చింది.

గెలుపు తర్వాత ప్రసాద్ ఏమన్నారంటే?"

ఇది నా విజయం కాదు, నన్ను నమ్మి గెలిపించిన నా గ్రామ ప్రజల విజయం. నాపై నమ్మకం ఉంచి, నాకు అండగా నిలిచిన ఎమ్మెల్యే విజయరమణారావు గారికి నా కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని, అవినీతికి ఆస్కారం లేకుండా, మడకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా" అని నూతన సర్పంచ్ ప్రసాద్ స్పష్టం చేశారు.

తెర వెనుక రాజకీయం!

అయితే, ప్రసాద్ గెలుపు అంత సులువుగా జరగలేదు. కాంగ్రెస్ పార్టీలోనే మరో నేత సర్పంచ్ పదవిని ఆశించినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు వ్యూహాత్మకంగా ప్రసాద్ వైపు మొగ్గు చూపడం, ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఏదేమైనా, ఓ యువకుడు, కళాకారుడు తమ గ్రామ నాయకుడు కావడంతో, మడక గ్రామ భవిష్యత్తుపై ప్రజలు కొత్త ఆశలు పెట్టుకున్నారు.

Sthanikam

ఉద్యోగం వదిలి.. ఊరికే పెద్దగా! యూట్యూబర్ ప్రసాద్.. ఇప్పుడు మడక సర్పంచ్!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news