కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి ప్రోత్సాహంతో కోదాడ 30వ వార్డు కౌన్సిలర్ కారింగుల ఉమ అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించగా,35 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించి చికిత్స అందించారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.సామాజిక సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని పలువురు కోరారు.ఈ కార్యక్రమంలో చలిగంటి ప్రసాద్, పంది తిరుపయ్య, ఎన్సీహెచ్ రాము,రాపోలు శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, వంగవీటి శేఖర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మిట్టకోలు కమలాకర్, చలిగంటి రంగా, తంగెళ్లపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి