మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో మంగళవారం చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఉదయం,రాత్రి వేళల్లో చల్లని గాలులు వీస్తుండటంతో బయటకు రావడానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చలి ప్రభావంతో అవస్థలు పడుతున్నారు.ఉదయం పనులకు వెళ్లే కూలీలు, రైతులు చలి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు వెచ్చని దుస్తులు ధరించడంతో పాటు పలుచోట్ల చలిమంటలు వేసుకుంటున్నారు.రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి