అధ్యక్షుడిగా దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తూర్పాటి శంకర్
అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
స్థానిక శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా జరిగింది. నూతన అధ్యక్షుడిగా దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తూర్పాటి శంకర్ నియామకాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ అధికారికంగా ప్రకటించారు.ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిళ్ల మురళి గురుస్వామి, మాజీ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్, మాజీ ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియ సాగింది.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ దేవాలయ నిర్మాణం ఎంతో నిష్ఠతో జరిగిందని గుర్తుచేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని ఆలయాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ పాలకవర్గం తరఫున ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని, వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆలయ సలహాదారు దాచేపల్లి ప్రకాష్ గుప్తా, విగ్రహ దాత కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, నాయకులు కంచరకుంట్ల వెంకటరెడ్డి, ఉప్పు ఆంజనేయులు, అంతటి రాము గౌడ్, తాడూరు పరమేష్, పెద్దగోని రమేష్ గౌడ్, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ఎలుగుబెల్లి అనిల్, కర్నాటి శ్యాంప్రసాద్, సుక్క సుదర్శన్, డాక్టర్ అనిల్, తిరందాసు జగన్నాథ్, బొడ్డు రాజేందర్ రెడ్డి, మలిగే శ్రీను, తోర్పునూరి నరసింహ గౌడ్, శశి, బోరం ప్రకాష్ రెడ్డి, ఆలయ అర్చకులు ఓంకార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి