Sthanikam - Truth Matters
Logo

చిరుమర్తి లింగయ్యపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు.. తక్షణమే క్షమాపణ చెప్పాలి

Updated : 10 Nov 2026 17:14 IST
As Preferred Source 1 min read
చిరుమర్తి లింగయ్యపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు.. తక్షణమే క్షమాపణ చెప్పాలి

చిట్యాల 2వ కౌన్సిలర్ షబానా అజీమ్ డిమాండ్.

చిట్యాల: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని చిట్యాల కౌన్సిలర్ షబానా అజీమ్ అన్నారు. ఆయన చేసిన బాధ్యతాయుతమైన వ్యాఖ్యలను వక్రీకరించి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగడం బాధాకరమని చిరుమర్తి లింగయ్య స్పందించారని తెలిపారు. ప్రజాప్రతినిధుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే వేముల వీరేశంకు భద్రత కల్పించాలని ఆయన కోరినట్లు వివరించారు.తెలంగాణ భవన్‌లో ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నియోజకవర్గ ఎమ్మెల్యేకు ప్రమాదం జరగడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని లింగయ్య సానుకూలంగా స్పందించారని చెప్పారు.

అయితే ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలు, ప్రజా సమస్యలకే పరిమితం కావాలని, వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదని హితవు పలికారు. చిరుమర్తి లింగయ్యపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని షబానా అజీమ్ డిమాండ్ చేశారు.

Sthanikam

చిరుమర్తి లింగయ్యపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు.. తక్షణమే క్షమాపణ చెప్పాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి