చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ నూతన అధ్యక్షుడిగా దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.గత 13 సంవత్సరాలుగా నిరంతరంగా అయ్యప్ప మాల ధరిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానానికి, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తున్న గోవర్ధన్ రెడ్డి.. సమాజంలో దైవభక్తి, ఆధ్యాత్మిక విలువల వ్యాప్తికి కృషి చేస్తున్నారు. శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయ నిర్మాణంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తూ, ఆలయాభివృద్ధికి తనవంతు సేవలు అందిస్తున్నారు.ఆయన నాయకత్వంలో ఆలయ నిర్మాణ, అభివృద్ధి పనులు మరింత శరవేగంగా ముందుకు సాగాలని, భక్తులకు విస్తృతస్థాయిలో ఆధ్యాత్మిక సేవలు అందుబాటులోకి రావాలని పలువురు ఆకాంక్షించారు. భక్తిని ఆచరణలో చూపిస్తూ ముందుకుసాగుతున్న గోవర్ధన్ రెడ్డి మరింతగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి