కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు మంగళవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బోడేపూడి శ్రీనివాసరావు, కౌన్సిలర్ ఉమా అంజన్ గౌడ్‌తో కలిసి రైతుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. డాక్టర్ పి. పెంటయ్య ఆధ్వర్యంలో పశువైద్యశాల మూగజీవాలకు విశేష సేవలందిస్తోందని ప్రశంసించారు. శిథిలావస్థకు చేరిన పశువైద్యశాల స్థానంలో ఎమ్మెల్యే, జిల్లా మంత్రి సహకారంతో రూ.1.50 కోట్లతో ల్యాబ్, ఎక్స్‌రే, స్కానింగ్, ఆపరేషన్ థియేటర్లతో కూడిన ఆధునిక భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కౌన్సిలర్ ఉమా అంజన్ గౌడ్ మాట్లాడుతూ..కోదాడ పశువైద్యశాలలో అత్యాధునిక వైద్య సేవలు, ఖరీదైన శస్త్రచికిత్సలు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు.ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా పెంపుడు జంతువులను వైద్యం కోసం కోదాడకు తీసుకొస్తున్నారని తెలిపారు.
ఈ శిబిరంలో 62 ఆవులు, గేదెలు, 138 గొర్రెలు, మేకలు, 140 కుక్కలు, కోళ్లు, పిల్లులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్య శిబిరం లో అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, చిలుకూరు కోదాడ మండల పశువైద్యాధికారులు డా కొండేటి వీరారెడ్డి, డా విజయ మధు, డా సిరిపురపు సురేంద్ర , సిబ్బంది కొండా సాయికృష్ణ, చంద్రకళ , బానోతు కరుణ్,వేనేపల్లి రవీందర్ రావు, కంపాటి సాగర్, షేక్ నజీర్ పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి