Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

చింతాబాబు మాదిగకు జాతీయ స్థాయి అంబేద్కర్ పురస్కారం

Updated : 10 Nov 2026 19:38 IST
As Preferred Source 1 min read
చింతాబాబు మాదిగకు జాతీయ స్థాయి అంబేద్కర్ పురస్కారం

బహుజన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ,సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న ఎమ్మార్పీఎస్ కీలక నాయకుడు చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించింది. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో చింతాబాబు అవార్డును అందుకోనున్నారు.

గత మూడు దశాబ్దాలుగా సామాజిక, ఉద్యమ రంగాల్లో ఆయన సేవలందిస్తున్నారు.మార్గదర్శి యూత్, స్ఫూర్తి యూత్ సంస్థల ద్వారా యువతలో చైతన్యం కల్పించడంతో పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.గతంలో దళిత రత్న, మాదిగ బంధు వంటి గుర్తింపులు పొందారు. తాజాగా జాతీయ స్థాయి అంబేద్కర్ పురస్కారం లభించడం పట్ల బహుజన సంఘాల నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ చింతాబాబుకు అభినందనలు తెలిపారు.

Sthanikam

చింతాబాబు మాదిగకు జాతీయ స్థాయి అంబేద్కర్ పురస్కారం

Article Image

బహుజన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ,సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న ఎమ్మార్పీఎస్ కీలక నాయకుడు చింతాబాబు మాదిగకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించింది. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో చింతాబాబు అవార్డును అందుకోనున్నారు.

గత మూడు దశాబ్దాలుగా సామాజిక, ఉద్యమ రంగాల్లో ఆయన సేవలందిస్తున్నారు.మార్గదర్శి యూత్, స్ఫూర్తి యూత్ సంస్థల ద్వారా యువతలో చైతన్యం కల్పించడంతో పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.గతంలో దళిత రత్న, మాదిగ బంధు వంటి గుర్తింపులు పొందారు. తాజాగా జాతీయ స్థాయి అంబేద్కర్ పురస్కారం లభించడం పట్ల బహుజన సంఘాల నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ చింతాబాబుకు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి