నల్లగొండలో నిర్వహించనున్న ఏఐకేఎస్ రైతు సంఘం అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం, సీపీఎం,ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నవంబర్ 15న లక్షలాది మందితో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ మంగళవారం మునగాల మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న మహాసభలకు రైతులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కౌలుదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సైదా, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి, మండల రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చందా చంద్రయ్య, స్టాలిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి