స్వాతంత్ర సమరయోధురాలు చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలను శనివారం మునగాల తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మార్వో సరిత పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మార్వో కార్యాలయ ఉద్యోగులు మరియు సిబ్బంది చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో సరిత మాట్లాడుతూ..ఒక మహిళగా ఐలమ్మ జీవితం నేటితరం మహిళలకు ఆదర్శనీయమని ఆమె ధైర్య సాహసాలు తెగువను ప్రతి మహిళా పునికిపుచ్చుకోవాలని సమాజంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు మహిళలు ఆత్మగౌరవంతో బ్రతికేందుకు ఐలమ్మ పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి