Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన నీలం మధు

Updated : 17 Oct 2026 13:38 IST
As Preferred Source 1 min read
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన నీలం మధు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ శనివారం నార్సింగిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌కు శాలువా కప్పి సత్కరించి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఎన్నికల కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన నీలం మధు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి