ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాల్సిన ఇంటి స్థలాలు, పింఛన్లు, హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చౌటుప్పల్ ప్రాంత ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ... స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు, హామీలు త్వరితగతిన అందేలా శాసనసభలో, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమానికి రాజగోపాల్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, తమ సమస్యల పరిష్కారంలోనూ ముందుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ప్రాంత ఉద్యమకారుల కోఆర్డినేటర్ కట్టెల లింగస్వామి, ఉద్యమకారులు ఉప్పు కృష్ణ, పకీరు శ్రీనివాస్ రెడ్డి, పెద్దగోని రమేష్ గౌడ్, మహమ్మద్ ఇబ్రహీం, రిక్కల ప్రవీణ్ రెడ్డి, జాల మల్లేష్, ఎస్కే మున్నా, గరిశ మహేష్, అంజనా చారి, సంగిశెట్టి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి