Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

దత్తత బాలుడి కుటుంబానికి కమిషనర్ భరోసా.

Updated : 11 Nov 2026 16:43 IST
As Preferred Source 1 min read
దత్తత బాలుడి కుటుంబానికి కమిషనర్ భరోసా.

భరత్ చంద్ర చారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాల ఆరా.. రూ.20 వేల ఆర్థిక సాయం.

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి నవంబర్ 11:

మానవత్వంతో ఆపన్నులకు అండగా నిలుస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఐఏఎస్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కంకణాలగూడెం గ్రామానికి చెందిన తాను దత్తత తీసుకున్న భరత్ చంద్ర చారి కుటుంబాన్ని బుధవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడిని ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితి, చదువు, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

భరత్ చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ అవసరాల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మూడు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. భరత్ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత తహసీల్దార్‌ను కోరారు.ఈ సందర్భంగా భరత్‌తో మాట్లాడుతూ.. చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాలుడి చదువు, కుటుంబ సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతానని తెలిపారు.

Sthanikam

దత్తత బాలుడి కుటుంబానికి కమిషనర్ భరోసా.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి