ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు.. విద్యార్థులకు వక్తృత్వ పోటీలు.
రామన్నపేట స్థానికం ప్రతినిధి నవంబర్ 11:
నాణ్యమైన విద్యతోనే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజం, దేశంప్రగతిసాధ్యమవుతుందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అన్నారు. ప్రతి విద్యార్థి విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం అధ్యక్షత వహించి విద్య ప్రాముఖ్యతను వివరించారు. 'జాతి నిర్మాణంలో విద్య పాత్ర' అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. కిషన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమ, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ జె. చిన్నబాబు, డాక్టర్ జి. సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి